నాగ చైతన్య, శోభిత ప్రేమ కథ..! 5 d ago
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులు ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వీరిద్దరూ వారి పరిచయం, ప్రేమ గురించి మాట్లాడారు.
శోభిత మాట్లాడుతూ "నాగ చైతన్య ను 2022 ఏప్రిల్ నుంచి ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను. చైతన్య తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫుడ్ ఐటెం పోస్ట్ చేయగా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉండడంతో మొదటిసారి తనతో ఆ ఫుడ్ ఐటెం గురించి మాట్లాడాను. నన్ను తెలుగులో మాట్లాడమని నాగచైతన్య తరచూ అడిగేవారు. అలా మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపడింది.
చైతన్య హైదరాబాద్ లో, నేను ముంబయిలో ఉండేవాళ్లం. చైతన్య నాకోసం హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చేవారు. మొదటిసారి మేము బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్లో ఉన్నాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్ కు వెళ్లాం. అక్కడ కొంత సమయం గడిపి ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు హాజరుకాగా అప్పటినుంచి జరిగినదంతా అందరికీ తెలిసిందే..'అని శోభిత తెలిపారు.
చైతన్య కుటుంబం నూతన సంవత్సర వేడుకలకు శోభితను ఆహ్వానించారు. ఆ మరుసటి సంవత్సరం ఆమె కుటుంబాన్ని చైతన్య కలిశారు. దీంతో ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత నాగ చైతన్య గోవా లో శోభితకు తన ప్రేమను వ్యక్త పరిచారు. ఇరువురి కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించడంతో డిసెంబర్ 4న చైతన్య, శోభిత వివాహం చేసుకున్నారు.